Health Kitchen | ఆరోగ్య వంటలు, Uncategorized

గోధుమలతో  – ఆరోగ్య చిట్కాలు

గోధుమలు

ప్రాచీన కాలంలో గోధుమలే ప్రధాన ఆహరం. నేడు గోధుమలను ప్రపంచ వ్యాప్తంగా విసృతంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో ఉత్తరాదిన బియ్యం కన్న గోధుములను ఎక్కువుగా వాడుతున్నారు. గోధుముల ద్వారా పిండిపదార్ధాలు, పీచు పదార్దాలు పుష్కలంగా లభించే ఈ గోధుమలు తక్షణ శక్తినివ్వగలవు. గోధుముల ద్వారా తయారుచేసే బ్రెడ్(brown), రొట్టెలు వంటివి విసృతంగా ఉపయోగిస్తారు.

baarli ravva
గోధుమ పిండి & గోధుమ రవ్వ

 

పోషకాలు:

                   గోధుమల్లో ఎక్కువుగా పిండి పదార్ధాలు లభిస్తాయి, చక్కని ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, మంగనీష్, సోడియం, జింక్, పాస్పరస్ వంటి ఖనిజ లవణాలు లభ్యమౌతాయి. అలాగే విటమిన్ b1, b2, b3, b5, b6, b9, విటమిన్ e మరియు విటమిన్ k వంటి విటమిన్లు అందిస్తాయి.

roti_chapati
గోధుమ చపాతీ

ఆరోగ్యలాభాలు:

                  గోధుమలు వలన జీవక్రియ మెరుగౌతుంది. మెగ్నీషియం పుష్కలంగా లభించడం వల్ల టైప్-2 డయాబెటిస్ ను  అదుపుచేయగలవు.

                 గాల్బ్లాడర్లో రాళ్ళు ఎర్పడటాన్ని, రుమాటిక్ నొప్పులను, గుండె జబ్బులను మరియు చిన్న పిల్లలలో తరచూ వచ్చే ఉబ్బసాన్ని నివారిస్తాయి.

నష్టాలు:

                గోధుమల్లో గ్లూటేన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఈ పదార్ధం సరిపడని కొందరిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగున్నాయి.

baarli-5
గోధుమ బ్రెడ్

పరిష్కారం:

               శ్రాస్త్రవేత్తలు ఈ సమస్యను గుర్తించిన తరువాత గ్లూటేన్ లేని గోధుమలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి ఇపుడు మార్కెట్లో కూడా బాగానే లభిస్తున్నాయి.

Leave a comment